పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి యుటిఎఫ్

ప్యాపిలి జూన్ 30 (ప్రజా నేత్ర న్యూస్ ) :2 లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయులకు తీరని నష్టం కలిగిస్తున్న కొత్త పెన్షన్ విధానాన్ని(సి పి యస్) తక్షణమే రద్దు చేసి ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో మాట ఇచ్చిన విధంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని యుటిఎఫ్ నంద్యాల జిల్లా కోశాధికారి నరసింహా రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్,ప్యాపిలి మండల శాఖ అధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి డిమాండ్ చేశారు.పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ కార్యదర్శి వర్గ సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ సి పి యస్ రద్దు పైన హామీ కూడా ఇవ్వని రాజస్థాన్,ఛత్తిస్ ఘడ్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని మొన్నటికి మొన్న జార్ఖండ్ రాష్ట్రం ప్రభుత్వం కూడా సి పి యస్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందని దేశవ్యాప్తంగా ఇంకొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నాయి.మరి సి పి యస్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు.సి పి యస్ విధానాన్ని రద్దు చేయకుండా దాని స్థానంలో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పడం ఏంటని విమర్శించారు.2035 నాటికి అయ్యే లెక్కలు చెప్తున్నారని ఇది 2 లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయులను మోసం చేయడమే అని అన్నారు.కావున ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సి పి యస్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాలని లేకపోతే మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు.అనంతరం ఐక్య ఉపాధ్యాయ ఆధ్వర్యంలో జి పి యస్ పైన తయారు చేసిన ప్రత్యేక సంచిక విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్లు చంద్ర మోహన్,అంజనప్ప,మండల సహాధ్యక్షులు హుసేన్ బాషా,మండల కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

? ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.