పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 3 ;

పట్టణాలలో మెరుగైన జీవన పరిస్థితుల కల్పనకు అధికారులు కృషి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవెష్ మిశ్రా తెలిపారు. శుక్రవారం నాలుగో విడత పట్టణ ప్రగతి లో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ లోని 27వ వార్డు నందు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర, జిల్లా అదనపు కలెక్టర్ దివాకర మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకట రాణి ప్రారంభించారు. ముందుగా 27వ వార్డు లోని హైటెక్ కాలనీ, జవహర్ నగర్ కాలనీ, రెవెన్యూ కాలనీ లో శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటూ వార్డులోని సైడ్ డ్రై ఇన్స్, పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తున్న లేదా పరిశీలించారు. వార్డులోని ఖాళీ స్థలాలు చెత్త వేస్తున్నారని ఇవి డంపింగ్ యార్డ్ గా మారిపోతున్నాయి ఇట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో జరగడం లేదని కలెక్టర్ అన్నారు. 27 వార్డులలో ఉన్న నాలుగు ప్లాట్లలో చెత్తను వేస్తున్నారని ఇవి చెత్త కుండీలుగా మారిపోయాయని ఇట్టి వారిపై కఠిన చర్యలు తీసుకో పోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి వార్డు లో వార్డు కమిటీ, గ్రీన్ కమిటీలను ఏర్పాటు చేసి వార్డు పనుల పరిశీలన పై వీరు నివేదికను సమర్పిస్తూ ఉంటారని కలెక్టర్ తెలిపారు. డ్రైనేజీ లపై నిర్మాణాలు చేపట్టడం వలన మురికి కూపాలు గా మారుతున్నాయి అని దీనివలన దోమలు, వీటివలన ఆరోగ్యం చెడిపోతుందని కావున, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని కలెక్టర్ అన్నారు. వార్డులో ఉన్న వారందరూ సమావేశమై ఒక నిర్ణయం తీసుకోండి దీనివలన వార్డులలో గల రోడ్లను వెడల్పు చేసి అన్ని సౌకర్యాలను కల్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. చెత్తను తీసివేయడానికి వహనాలకు డ్రైవర్ల కొరత ఉందని వార్డు కౌన్సిలర్ హరీష్ రెడ్డి తెలపగా వెంటనే స్పందించిన కలెక్టర్ 15 మంది కొత్త డ్రైవర్లను తీసుకోవలసిందిగా కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ పై ఇంటి నిర్మాణాలు చేపట్టారని, పది ఫీట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇది మంచి విషయం కాదని కలెక్టర్ పేర్కొన్నారు, వారందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఇంటికి ఆరు ముక్కలను ఇవ్వడం జరుగుతుందని వాటిని ఇంటి ఆవరణలో తప్పక ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రగతి లో భాగంగా ఈరోజు వార్డులో సందర్శన వల్ల డ్రైనేజీ సమస్య చాలా ఉందని, అలాగే మిషన్ భగీరథ పైప్ లైన్ లో కోసం రోడ్లకు ఇరువైపులా గుంటలు ఏర్పడ్డాయని ,వర్షాకాలం రాకమునుపే వాటినన్నిటిని పూడ్చి కాంక్రీట్ చేస్తామని కలెక్టర్ మాట ఇచ్చారు. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ వార్డులో మిషన్ భగీరథ పథకం కొరకు రోడ్లను తవ్వి ప్రజలకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మిషన్ భగీరథ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులోని వారందరూ కలిసి స్వచ్ఛందంగా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి చెబితే రోడ్లను, కాలువలను మంచిగా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు .ప్రజలు ఇళ్ల వద్ద ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుకోవాలి అని దీనివలన ఆక్సిజన్ మనకు అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వార్డులోని ప్రజలు డ్రైన్లు రోడ్లు కావాలని అడిగారని వీటికి ఎస్టిమేషన్ వేసి నివేదిక పంపాలని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణ ప్రగతి లో సింగరేణి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదిహేను రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి రోజువారీ కార్యక్రమాలను రూపొందించుకొని అమలు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు జవాబు దారీతనం తో పనిచేయాలన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమంలో మనము అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. డ్రైనేజీ ,వాటర్ సమస్య లపై ఒక ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఇచ్చారని తెలిపారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే శుభ్రపరచుకోవాలి అని, ఇంటి చుట్టూ ఆవరణలో మొక్కలు నాటుకొని ఆక్సిజన్ పెంపొందించుకోవాలని అన్నారు.కరోనా టైంలో ఆక్సిజను కొనుక్కోవడం జరిగిందని గుర్తు చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములై భూపాలపల్లి పట్టణాన్ని క్లీన్ గా ఉంచుదామని చైర్ పర్సన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వై చైర్పర్సన్ కే హరి బాబు, ఉ వార్డు కౌన్సిలర్ హరీష్ రెడ్డి, మున్సిపల్ ఏఈ రోజా రాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, టౌన్ ప్లానింగ్ అధికారి పి అవినాష్, విక్రమ్, ప్రజలు, ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.