పట్టణంలో మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలి.

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 10 ; పట్టణంలో వసతులను మెరుగుపరచి ఆదర్శ పట్టణం గా తీర్చిదిద్దాలని భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్ర తెలిపారు. శుక్రవారం పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకట రాణి సిద్ది తో కలిసి 15, 16 ,17 వార్డులలో కలెక్టర్ పర్యటించారు. మున్సిపల్ సిబ్బంది పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి సిబ్బంది ఉదయం నుంచే పనులు చేపట్టాలని, మురుగు కాలువలు వ్యర్థాలను తీసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలకు అన్ని వసతులను మెరుగు పరచి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ తెలిపారు.17వ వార్డులో సుభాష్ నగర్ రోడ్లను, కాలువలను పరిశీలించారు. కొంతమంది మున్సిపల్ కాలువలై ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు అట్టి వారిని పిలిపించి కలెక్టర్ పారిశుద్ధ్య సిబ్బందికి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. రెండు రోజుల్లో అక్రమ నిర్మాణాలు అన్ని తీసి వేయాలన్నారు, లేనిచో అధికారులు మున్సిపల్ సిబ్బంది అక్రమాలను తొలగిస్తారని వారికి తెలిపారు. సుభాష్ నగర్ లోని రామాలయం నుండి చర్చి వరకు సైడ్ ట్రైన్ నిర్మాణం కొరకు నివేదిక పంపాల్సిందిగా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సూచించారు. వార్డులోని మహిళలు కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు, లైన్లు ఇబ్బందిగా ఉన్నాయని వాటిని సరి చేయించాలని కలెక్టర్ ని అడిగారు. అంగన్వాడి సెంటర్ కొరకు సుభాష్ నగర్ లోని జెండా లైన్ వద్ద ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, అంగన్వాడి కేంద్రాన్ని నిర్మాణం కొరకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం 16 వార్డు లో మున్సిపల్ అధికారులు సిబ్బంది తో కలిసి కలెక్టర్ వార్డు ను పరిశీలించారు .సింగరేణి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రజలు కలెక్టర్కు విన్నవించారు. అంగన్వాడి సెంటర్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి నివేదిక పంపాలని కలెక్టర్ పేర్కొన్నారు. అక్కడి నుండి 15 వార్డులో కలెక్టర్ కౌన్సిలర్ సరళ తో కలిసి పర్యటించారు. గత 15 సంవత్సరాలుగా గృహాలలో నివాసముంటున్న వారికి హక్కు పత్రాలు ఇప్పించ వలసిందిగా కౌన్సిలర్ కలెక్టర్ తెలిపారు. కాకతీయ కాలనీ లోని పోచమ్మ గుడి వద్ద సింగరేణి వారి గోడ వలన చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని ఆ గోడను తొలగించాలనీ వార్డు మహిళలు కలెక్టర్ను కోరారు, త్వరలో సింగరేణి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. వార్డు లో గల ప్రభుత్వ భూమిలో క్రీడా ప్రాంగణానికి కేటాయించాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో పనులు చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డ్ కౌన్సిలర్ సరళ, 16వ వార్డ్ కౌన్సిలర్ దాట్ల శ్రీను ,17వ వార్డు కౌన్సిలర్ ఎం మురళి, మున్సిపల్ ఏఈ రోజా రాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, టౌన్ ప్లానింగ్ అధికారి అవినాష్, ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.