పట్టణంలో పందులు లేకుండా చూడాలి.కలెక్టర్ భవేష్ మిశ్ర

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 22 ;మున్సిపాలిటీ లో ఎక్కడ పందుల సంచారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్ నందు మున్సిపల్ సిబ్బంది, పశుసంవర్ధక శాఖ వారితో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో పందుల సమాచారం లేకుండా పందులను పెంచుకునే కుటుంబాలను గుర్తించి వారిని వారి కుటుంబాలను పట్టణానికి దూరంగా పందుల పెంపకం కొరకు 2.5 ఎకరాల భూమిని అన్ని వసతులతో పందుల పెంపకం దారులకు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో విచారణ జరిపి పందుల పెంపకం దారుల వివరాలను వారు పెంచుతున్న పందుల సమూహాలను పరిశీలించి ఒక నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి వి &కే హెచ్ ఓ సదానందం, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఏఈ రోజా రాణి, tpo మహేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.