పకడ్బందీగా పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ అభివృద్ధి లక్ష్యం – స్పెషల్ ఆఫీసర్ సోమ జాహ్నవి

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:11-06-2022 ; ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలం తంతొలి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం తొమ్మిదవ రోజు పవర్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ సోమ జాహ్నవి మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి, అట్టి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. గ్రామంలో రోడ్లు మరియు మురికి కాలువలు శుభ్రపరచడం జరుగుతుందన్నారు. గ్రామంలోని కొంతమంది నీరు సరిగ్గా అందడం లేదని తెలపడంతో వెంటనే మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం పకడ్బందీగా అమలు అయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు గ్రామ స్పెషల్ ఆఫీసర్ సోమ జాహ్నవి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రాజు, కారోబార్ సురేష్, వినోద్, అనిల్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.