నేషనల్ హైవే భూసేకరణ త్వరగా చేయాలి.కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 16 ; నేషనల్ హైవే భూసేకరణ త్వరితగతిన చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో నందు నేషనల్ హైవే 353c పై సమీక్ష నిర్వహించారు. మహాదేవపూర్ నుండి కాలేశ్వరం చెక్ పోస్ట్ బ్రిడ్జి వరకు 17.2 కిలోమీటర్ల నేషనల్ హైవే నిర్మాణానికి త్వరగా భూసేకరణ చేయాలని, అటవీ శాఖ వారి భూమి , కాలేశ్వరం, కన్నేపల్లి గ్రామాలలో రైతుల వ్యవసాయ భూమి ఎంత ఉంది, దీనిలో ఎస్టి రైతులు ఎంత మంది ఉన్నారు, నివేదిక సమర్పించాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్ట్, నేషనల్ హైవేస్, అధికారులు కలసి జాయింట్ సర్వే చేయవలసిందిగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరి నాగారం ఐటీడీఏ పీవో అంకిత్ ఐఏఎస్ ,నేషనల్ హైవేస్ ఎం విద్యాసాగర్, అటవీశాఖ వజ్రా రెడ్డి , ఆర్ డి ఓ కే శ్రీనివాస్, తాసిల్దార్ శ్రీనివాస్, ఎటిడిఓ ధేషి రాం, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.