నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలి – IFTU

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:25-06-2022; రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని IFTU జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జగన్ సింగ్, సుభాష్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో IFTU జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు వర్షాలు పడడంతో దుక్కులు దున్ని విత్తనాలు నాటుటకు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని కోరారు. గతంలో కొంతమంది రైతులు నకిలీ విత్తనాల మాఫియా విత్తనాలు నమ్మి వారి చేతిలో మోసపోయారు అన్నారు. విత్తనాలు నాటే సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తనాల మాఫియా గతంలో లాగా పునరావృతం చేసే అవకాశం ఉన్నందున అధికారులు ఫర్టిలైజర్ షాప్ ల యందు తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాల మాఫియా ఆటలు అరికట్టాలని IFTU గా డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.