నర్సరీలను పరిశీలించిన ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్ సోమ జాహ్నవి

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:24-06-2022;ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర, దిమ్మ గ్రామ పంచాయతీలలో గల నర్సరీలను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ సోమ జాహ్నవి పరిశీలించారు. పొచ్చెర గ్రామ నర్సరీలో 10,000 మొక్కలు, దిమ్మ గ్రామ నర్సరీలో 10,000 మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. నర్సరీలలో గల గడ్డి తొలగించాలని, అన్ని మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకోవాలని వన సేవకులకు సూచించారు. త్వరలోనే హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున నర్సరీలో గల మొక్కలను రక్షించి సిద్ధంగా ఉండాలన్నారు. పొచ్చెర గ్రామంలో జరుగుతున్న కమ్యూనిటీ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. నిబంధనల ప్రకారం మొక్కలు నాటాలని కూలీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లక్ష్మి, సతీష్, ఉప సర్పంచ్ మహేందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, శ్యామల, వన సేవకులు హరీష్, ప్రశాంత్, గ్రామ కూలీలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.