దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్

దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్

నిందితుల నుండి రూ.2,98300 నకిలీ నోట్ల స్వాధీనం

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 25 ; సులువుగా డబ్బులు సంపాదించాలన్న అశతో, అక్రమ మార్గం ఎంచుకుని, దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముగ్గురు నిందితులను మహదేవ్ పూర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయoలో ఎస్పి జె. సురేందర్ రెడ్డి వెల్లడించారు.పోలు సతీష్ s/o సమ్మయ్య, వయస్సు: 26 సంవత్సరాలు, కులం: మున్నూరు కాపు, వృత్తి: వ్యవసాయం R/o బెగుళూర్ గ్రామం, మహాదేవపూర్ మండల నివాసి, ఇతను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు, అతని ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని, దొంగనోట్ల వ్యాపారం చేసి దాని ద్వారా సులభంగా సంపాదించాలనుకున్న సతీష్, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఎలుకూచి సురేష్ s/o మల్లయ్య లతో కలిసి నిర్ణయించుకొని, ఇద్దరు కలిసి గత పది రోజుల క్రితం వారికి తెలిసిన వ్యక్తి అయినా మహారాష్ట్ర, సిరోంచ కు చెందిన జయంత్ అనే అతని వద్దకు వెళ్లి, దొంగనోట్ల వ్యాపారం చేసి డబ్బు సులువుగా డబ్బు సంపాదించాలకున్న విషయం తెలుపగా అతడు కూడా దొంగ నోట్ల వ్యాపారానికి ఒప్పుకుని, సతీష్, సురేష్ లను జయంత్ అకోలా లో నకిలీ కరెన్సీ ఇస్తారని తెలిసి జయంత్ వీరిని అకోలా కి తీసుకెళ్ళినాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వీరు రూ. 50 వేల ఒరిజినల్ నోట్లు ఇస్తే తాను వీరికి వాటికి బదులుగా మూడు లక్షల రూపాయలు దొంగనోట్లను ఇస్తాను అని చెప్పగా వీరు ముగ్గురు సరే అని ఒప్పుకుని వీళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ రూ. 50 వేల నోట్లని అట్టి గుర్తు తెలియని వ్యక్తికి ఇవ్వగా, అతడు వీళ్ళకు మూడు లక్షలు రూపాయలు ఇచ్చినాడు. ఆ తర్వాత వాటిని తీసుకొని తిరిగి నోట్ల మార్పిడి ద్వారా ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుని మొదటగా అక్కడి నుండి బయలుదేరి మహారాష్ట్రలో అక్కడక్కడ వీళ్ళ వద్ద ఉన్న దొంగ నోట్లు అగు రూ. 1700 ఖర్చు చేసినారు. అవి ఒరిజినల్ నోట్ల లాగానే చలామణి అయినాయి. మిగిలిన దొంగనోట్లను విడి విడి గా ఖర్చు చేద్దామని అనుకుని అలా ముగ్గురు వాటిని పంచుకోగా సతీష్ వద్ద ఒక లక్ష 20 వేల రూపాయలు, జయంత్ వద్ధ ఓ‌క లక్ష10 వేల రూపాయలు మరియు సురేష్ వద్ద 68 వేల 300 రూపాయలు ఉంచుకుని, వాళ్ళ ఇళ్ళల్లో దాచుకున్నారు, అయితే అట్టి దొంగ నోట్లను ఇక్కడ ఉపయోగిస్తే వాళ్ళు దొరికిపోతమేమో అని భయంతో వాటిని మళ్ళీ మహారాష్ట్ర లోనే చెలామణీ చేసుకుందామని అనుకుని ముగ్గురు ఒక్కటి గా వెళ్ళి చలామణి చేద్దామని అనుకుని తేదీ 24.06.2022 రోజున సతీష్ యొక్క కారు (స్వీఫ్ట్ VDI-B.NO: AP28 DS 0008) గల దానిలో మహారాష్ట్రకు వెళుతుండగా మార్గ మద్యలో కుదురుపల్లి “X” రోడ్డు దగ్గరకు చేరగానే మహాదేవపూర్ పోలీసులు వాహన తనిఖీ చేస్తూ వాళ్ళు ప్రయాణిస్తున్న కారుని ఆపి, తనిఖీ చేయగా, వారి వద్ధ ఉన్న దొంగ నోట్ల కవర్లు దొరికినవి. అలా సతీష్, సురేష్, జయంత్ వద్ద నుండి అట్టి దొంగ నోట్ల కట్టలు గల కవర్లు పోలీసు వారు స్వాధీనపరుచుకుని. కేసు నమోదు చేసినారు.

స్వాధీన పరచుకున్న నోట్ల వివరాలు
(100 X 995
200 X994)
Total amount 2,98,300/-
వాటి పైన ఇంగ్లిష్ లో CHILDREN BANK OF INDIA అని ముద్రించి కలదు, అలాగే అట్టి నోట్ల పైన సీరియల్ నెంబర్ ను పరిశీలించగ అన్నింటి పైన OAA000000 లు కలవు. అలా మొత్తం రెండువందల రూపాయల నోట్ల కట్టలు అయిదు మరియు వంద రూపాయల నోట్ల కట్టలు రెండు కలవు.చాకచక్యంగా వ్యవహరించి దొంగ నోట్లు చలామణి చేస్తున్న నిందితులను పట్టుకున్న మహదేవ్ పూర్ సిఐ కిరణ్, ఎస్ఐ ఎన్. రాజకుమార్ మరియు సిబ్బందిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి అభినందించారు.

 

Leave A Reply

Your email address will not be published.