తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కొమురం భీం జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్

కొమురం భీం జిల్లా కేంద్రంలో అసిఫాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు కాండ్రే విశాల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా భారతీయ జనతా పార్టీ కొమురం భీం జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ గారు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారుఅనంతరం వారు మాట్లాడుతూ 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను 1200 మంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణకు ఈ రోజుతో 8 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు డా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన చిన్న చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే రాష్టం వేగంగా అభివృద్ధి చెందుతున్నారని గుర్తు చేశారుతెలంగాణ ఉద్యమంలో చిన్నమ్మ సుష్మాస్వరాజ్ గారు తెలంగాణ ప్రజల చిరకాల వాంఛకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టండి మద్దతు తెలుపుతామన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రములో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారుతెలంగాణ రాష్ట్రములో ఏదైనా అభివృద్ధి సాధించింది ఏదైనా ఉందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే అన్నారు రాబోవు కాలంలో తెలంగాణ రాష్ట్రములో భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంలో వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు సుదర్శన్ గౌడ్, కొత్నాక విజయ్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు రాధిక, చెర్ల మురళీ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కుమురం వందన,అసిఫాబాద్ టౌన్ ఉపాధ్యక్షులు పులి సంజీవ్,v k సంతోష్ కుమార్ మండల కార్యదర్శి,bjym నాయకులు మెడి కార్తిక్, మందాడే సుధాకర్, అల్లి వసంత్ రావు,వేణుగోపాల్ రావు, గణేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.