జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 2;తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి శ్రీ జె. సురేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు అధికారులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ… ముందుగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు సుదీర్ఘ ఉద్యమ పోరాటంతో పాటు, అమరుల త్యాగఫలం ఉందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల తెలంగాణ సంస్కృతికి, గుర్తింపు వచ్చాయన్నారు.తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ అభివృద్ధిలో మనవంతు పాత్ర ఏంటి అని యువత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా పోలీసులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.ప్రజలకు చట్టం ప్రకారం నీతి, నిజాయితీతో పారదర్శకతతో ధనిక, పేద తేడా లేకుండా పోలీస్ సేవలు అందించాలన్నారు. పోలీసులు నిరంతరం శాంతిభద్రతలు కాపాడటంలో ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడటం లో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో వీర జవాన్లు.. ఉగ్రవాదులు, తీవ్రవాదులు మరియు ఇతర సంఘ విద్రోహ శక్తులతో పోరాడి వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నరని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా పేరొందిందన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, జిల్లా వర్టికల్ ఇంఛార్జి డిఎస్పీ ఈ. కిషోర్ కుమార్, డిపిఓ ఏఒ అయూబ్ ఖాన్, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ , డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.