జిల్లాలోని శిఖం భూములను సర్వే చేయాలి. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 21; జిల్లాలోని అన్ని శిఖం భూములను సర్వే చేసి నివేదిక అందించాలని కలెక్టర్ భవిష్ మిశ్రా తెలిపారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని ప్రగతి భవన్ నందు జిల్లా ఎస్ సి, ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో లో జిల్లా కలెక్టర్ భూపాలపల్లి, శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా లోని అన్ని చెరువు శిఖం భూములను సర్వే చేసి వాటికి హద్దులు నిర్ణయించి, గిరిజన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశాలకు వచ్చినప్పుడు సంబంధిత అధికారులు పూర్తి సమాచారంతో రావాలని కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు .మహాముత్తారం కాటారం, పలిమెల ,వజినేపల్లి గ్రామాలలో ఉన్న భూముల ను ఎవరు సాగు చేసుకుంటున్నారు అట్టి వారి వివరాలు తేలియ జేయాలని కలెక్టర్ తాసిల్దార్ లను ఆదేశించారు. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి గారు మాట్లాడుతూ భూపాలపల్లి, కాటారం లో భూ వివాద కేసులపై సర్వే చేపట్టాలని అదనంగా సర్వేయర్లు తీసుకొని వారి ద్వారా పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులను శాసనసభ్యులు ఆదేశించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చంద్రమౌళి, భద్రయ్య, సమ్మయ్య వారు అడిగిన అంబేద్కర్ భవన్, కమ్యూనిటీ హాల్ కు భూమిని పరిశీలించమని ఎమ్మెల్యే అధికారులను తేలిపారు. ఈ సమావేశంలో దళితులపై జరుగుతున్న దాడులు, కేసులలో పురోగతి గురించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్ పి శ్రీనివాసులు, జిల్లా షెడ్యూల్ కులాల అధికారి సునీత, డ్రైవర్ వెల్ఫేర్ డిడి పోచం, భూపాలపల్లి డీఎస్పీ రాములు, కాటారం డిఎస్పీ బోనాల కిషన్, భూపాలపల్లి తాసిల్దార్ ఎగ్ బాల్, శ్రీనివాస్ ,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజు, రజిత ,సంతోష్ నాయక్, చంద్రమౌళి, భద్రయ్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.