జాతీయ స్థాయి యోగా పోటీలో… – పాలమూరు విద్యార్థుల ప్రదర్శన

ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి యోగా పోటీలో ఎ మహబూబ్ నగర్ కు చెందిన విద్యార్థులు యోగా విన్యాసాలను ప్రదర్శించారు. రెడ్ క్రాస్ అనాథాశ్ర మానికి చెందిన కవిత, లత, రాజేశ్వరి, సాయి కీర్తన,నందిని లు జాతీయ స్థాయి యోగా పోటీలో వివిధ రకాల యోగా విన్యాసాలను ప్రదర్శించి అందరిచే శభాష్ అనిపించుకున్నారు. యోగా మాస్టర్ ఎ ఎస్ ఐ వనజ , కోచ్ సాయి కుమార్ నేతృత్వంలో యోగా లో శిక్షణ పొందిన విద్యార్థులు ఢిల్లీలో యోగా ప్రదర్శన చేసిన విద్యార్థులను . ఎంపికైన విద్యార్థుల ను ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, రెడ్ క్రాస్ చైర్మన్ నట రాజు, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు బెక్కం జనార్దన్, వైస్ ఛైర్మన్ డా: శ్యాముల్, కోశాధికారి ఎస్.జగపతి రావు, యం సి మెంబర్స్ రమణయ్య, డా: విష్ణు జనార్దన్, వీరేశం తదితరులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.