చిరు వ్యాపారులకు రుణ వితరణ

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 8 ;13 కోట్ల 69 లక్షల రూపాయలు 398 లబ్ధిదారులకు రుణాలు ఈ రోజున మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్ర తెలిపారు .బుధవారం ప్రగతిభవన్లో ఆజాదిక అమృత్ మహోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం, రాష్ట్ర బ్యాంకుల సమన్వయ సమితి మార్గదర్శకాల మేరకు భూపాలపల్లి జిల్లా నందు అన్ని బ్యాంకుల సమన్వయంతో ప్రగతి భవన్ నందు ప్రజా చేరువ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 13 బ్యాంకులు పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ,ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన ప్రాంతం వాతావరణం చాలా అనుకూలంగా ఉండటం వలన అందరూ భూపాలపల్లిలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని కలెక్టర్ తెలిపారు. బ్యాంకు మేనేజర్లు గ్రామాలకు వెళ్లి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు మధ్యవర్తుల మోసాలకు గురి అవుతున్నారని దీన్ని రూపు మారాలంటే బ్యాంకు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మన జిల్లా లక్ష్యాలను అన్ని బ్యాంకులు సాధించారన్నారు. అన్ని బ్యాంకులు రుణాలు మంజూరు చేసి మన జిల్లాను ఆస్పిరేషన్ జిల్లా నుండి బయట పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు . పిఎంఈజిపి ఈ పథకం ద్వారా 13 బ్యాంకుల ద్వారా 24 మందికి, ఎనభై నాలుగు లక్షల రూపాయలు వీధి వ్యాపారులకు 132 మందికి 26 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందని, దీనిలో వీధి వ్యాపారులు మొదటగా తీసుకున్నవారు తిరిగి కట్టడం వలన రెండో విడత రుణాలు కూడా తీసుకోవడం వారు అభివృద్ధిలోకి రావడం జరిగిందన్నారు. స్వయం సహాయక గ్రూపుల 242 సంఘాలకు 12 కోట్ల 22 లక్షల రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు, జిల్లాలో ఈ రోజు 398 మంది ఇది తాను 13 కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు 38 బ్యాంకు శాఖల ద్వారా అందజేయడం జరిగిందన్నారు. అనంతరం బ్యాంకులో వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకట రాణి ఎస్బిఐ ఏజీఎం కభిరాజ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో లో లిడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస రావు, నోడల్ ఆఫీసర్ కభీరాజు, డి ఆర్ డి ఓ డి పి ఎమ్ రవి,మెప్మా అధికారి రాజేశ్వరి, జి ఎం ఎస్ ఐ సి శ్రీనివాస్ అన్ని బ్యాంకుల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.