ఘనంగా NFIW 65వ ఆవిర్భావ దినోత్సవం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భారత జాతీయ మహిళా సమైక్య (NFIW) జిల్లా కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా NFIW జెండాను జిల్లా కార్యదర్శి వినోద ఎగురవేశారు. అనంతరం జిల్లా సభ్యురాలు సుశీల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వినోద మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళ హక్కులు కాలారస్తు మహిళల చట్టాలు అమలు చెయ్యడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నీరు దొరకడం లేదు కానీ మద్యం విచ్చలవిడిగా ఎరులై పారుతుందని అన్నారు. మహిళలపై హత్యాచారాలు లు రోజు,రోజుకు పెరుగుతున్నయని రక్షణ కరువైందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హత్యచరలు అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమవేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కుంటలా రాములు, సమాఖ్య సభ్యులు కె రుక్మిణి, భగ్యశ్రీ, సుకెష్స్న, మేస్రం సుజాత, రేస్మ, సీమా, ప్రజాపతి, సునీత,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.