గౌరవెల్లి ప్రాజెక్టుకు దేశిని చిన్న మల్లయ్య పేరును నామకరణం చేయాలి – జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు

కరీంనగర్ జిల్లా : జూన్11,(ఎల్కతుర్తి మండలం / హన్మకొండ రోడ్డు గ్రామం ) శ్రీరాంసాగర్ ప్రాజెక్టు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు మాజీ ఎమ్మెల్యే దివంగత మహానేత దేశీని చిన్న మల్లయ్య పేరును నామకరణం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎల్కతుర్తి గ్రామంలో దేశిని చిన్న మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజు మాట్లాడుతూ గతంలో హుస్నాబాద్ అంతర్భాగంగా ఉన్న పాత ఇందుర్తి నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన దేశిని చిన్న మల్లయ్య గౌడ్ , హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి వరద కాలువ తీసుకురావడంతో పాటు గౌరవెల్లి ప్రాజెక్టు అంకురార్పణ కావడానికి ఎంతో కృషి చేశారని రాజు స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతానికి వరద కాలువతో పాటు ,నిరుపేదలకు భూ పంపిణీ కోసం ఎన్నో పోరాటాలు చేసి నీతివంతమైన పరి పాలన చేసిన వ్యక్తిగా దేశిని చిన్న మల్లయ్య ఇప్పటి పరిపాలకులకు ఆదర్శప్రాయుడని పిడిశెట్టి రాజు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవెల్లి ప్రాజెక్టుకు దేశిని చిన్న మల్లయ్య పేరును నామకరణం చేసేలా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై రానున్న వారం రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలలో సైకిల్ యాత్ర చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యేక చొరవ విదంగా ఉద్యమిస్తామని రాజు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఎల్కతుర్తి మండల్ అంబెడ్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే నవనిర్మాణ సమితి రాష్ట్ర నాయకులు ఇమ్మడి మాణిఖ్యం,సాతురి తిరుపతి, రెనుకుంట అశోక్, ఆదిత్య, మహేష్, రమేష్, లింగముర్తి, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.