గడప గడపకు బిజెపి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు

కరీంనగర్ జిల్లా/ జమ్మికుంట పట్టణం: ప్రధానమంత్రి నరేంద్రమోడీ 8 సంవత్సరాల సుపరిపాలలో భాగంగా గడప గడపకు బిజెపి చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమలపై జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడూతూ కేంద్రంలోని నరెంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు ఈ 8 సంవత్సరాల సమయంలో చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమల యొక్క కరపత్రం ప్రతి గడప గడపకి పంచాలని, ప్రతి ఒక్క వ్యక్తికి బిజెపి ప్రభుత్వం చేసే అభివృధి,అదేవిధంగా అంత్యోదయ పేదలకు అట్టడుగు వర్గాలకు సేవ, కరోనా మహమ్మారి తో పోరాటం, యువత నేతృత్వంలో అభివృద్ధి, రైతు సంక్షేమానికి భరోసా మనకు వచ్చే పధకాల గురించి అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవ రెడ్డి, కోరె రవీందర్, దొంతుల రాజ్ కుమార్, పల్లెపు రవి, బిజెపి కార్యకర్తలు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.