కోడూరు సమతా నగర్ లోఇంటింటికి సిపిఎం, సర్వే!

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ బుడుగుంట పల్లి పంచాయతీ సమతా నగర్ లో బుధవారం సిపిఎం జిల్లా నాయకులు  సిహెచ్. చంద్రశేఖర్, మండల సీనియర్ నాయకులు  లింగాల యానాదయ్య, దాసరి జయచంద్ర,  కర్ర తోటి హరినారాయణ, రామకృష్ణ, ఆధ్వర్యంలో,  ఇంటింటికి సిపిఎం కరపత్రాలను, పంచి, సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. వీధి లైట్లు లేవు అని అంధకారంలో ఉన్నామన్నారు.  ఈ విషయం సర్పంచ్ దార్ల చంద్రశేఖర్, దృష్టికి తీసుకు పో గా,  వీధిలైట్లు వేస్తామని హామీ ఇచ్చారు. కరెంటు పోల్  ఒరిగి కూలడానికి సిద్ధంగా ఉందని,  మెయిన్ కరెంటు వైర్,   తెగిపోవడానికి సిద్ధంగా ఉందని, ప్రమాదాలను, విద్యుత్ అధికారులు  రూరల్ ఏ ఈ దృష్టికి చంద్రశేఖర్ తీసుకెళ్లారు, పరిష్కరిస్తామన్నారు.   గిరిజనులు సాగు భూములకు, కొందరికి పట్టాలు లేవని, కొందరికి పట్టాలు ఉన్నా పాస్బుక్కులు ఇవ్వలేదని తెలిపారు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పెన్షన్లు, ఇంకా చాలా మందికి రాలేదన్నారు. వృద్ధాప్యం, వికలాంగులు ,  విడో పెన్షన్లు రాలేదని నాయకుల దృష్టికి తెచ్చారు. గిరిజనులు 50 మంది పిల్లలు ఉన్నా అంగన్వాడి సెంటర్ లేదన్నారు, అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీజనులో  వ్యవసాయ కూలి పనులకు బొప్పాయి, మామిడి,  బిల్డింగ్ పనులపై ఆధారపడ్డారు.  ఈ పనులు రోజు దొరకడం లేదని, ఇసుక కొరత వలన, బిల్డింగ్ పనులు లేవన్నారు. మరోపక్క  వెలుగు డ్వాక్రా అధికారులు,  లోన్లు కట్టాలని వేధిస్తున్నారని తెలిపారు.  కరోనాతో పనులు లేక ఇబ్బంది పడుతుంటే, అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు.  పూర్తిగా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల నిత్యవసర ధరలు పెరిగాయని, వైసిపి ప్రభుత్వం లో సంతోషంగా అయితే లేమని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు సిపిఎం అండగా ఉంటుందని, కేరళలో సిపిఎం పార్టీ సమర్థవంతంగా పరిపాలించి, రెండోసారి అధికారంలోకి వచ్చిందని వివరించారు. పై సమస్యల పరిష్కారానికి ఆందోళన సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.