కేసీఆర్ పాలనపై రమేష్ రాథోడ్ ధ్వజం

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు. కేసీఆర్ పాలనపై రమేష్ రాథోడ్ ధ్వజం.. కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తయారు చేశాడని ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ధ్వజమెత్తారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు ఖానాపూర్ నియోజకవర్గంలోని ధస్థురాబాద్ మండలంలోని బీజేపీ నేత రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవునిగూడెం,ధస్థురాబాద్, భుత్కూర్, మున్యాల్, రేవోజిపేట్, గోడిసిర్యాల, బుట్టాపూర్, మల్లాపూర్ పంచాయతీల్లోని ప్రజలు రాథోడ్ రమేష్ కు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి ప్రధానమంత్రి పథకాలను ప్రజలకు వివరించారు. కేసీఆర్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని,ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు.రాబోయే రోజుల్లో బీజేపీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడిమాల లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి సాగర్ గౌడ్, ఎస్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే నారాయణ ,సీనియర్ నాయకులు చుంచు వెంకన్న, రాజేశం.దోనకంటి స్వామి,హన్మగౌడ్, పానుగంటి రాజు రాజమల్లు, గాజుల రవి,పులి నర్సయ్య ,దాసరి వెంకటరమణ, తిరుపతి నాయక్ ,,శక్తి కేంద్ర ఇంచార్జీలు బొమ్మేన రఘు,భద్రం నాయక్, రామగిరి భూమేష్,ఆత్రం శ్రీనివాస్ ,జగన్ బూత్ అధ్యక్షులు రాజేందర్, గంగాధర్,సఙ్ఘన్న ,లక్ష్మీ నర్సయ్య, మూతికట్ల నగేష్, మునిందర్,రాజన్న,కళ్యాణ్ నాయక్,సర్వ స్వామి,వంగల సాయి,ఆత్రం రవీందర్, కోడూరి నరేష్,దాసరి శ్రీనివాస్, తిరుపతి,రాజశేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.