కేసీఆర్ ను గద్దె దింపడం ఖాయం..అదేష్ కుమార్ గుప్తా

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 30 ; తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ఢిల్లీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అదేష్ కుమార్ గుప్తా అన్నారు గురువారం జాతీయ పార్టీ ఆదేశాల మేరకు భూపాలపల్లి నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఢిల్లీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ డిల్లీ మేయర్ ఆదేష్ కుమార్ గుప్తా భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించి గణపురం మండలంలోని మహిళా మోర్చా కార్యకర్తల ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆదేశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో వాతావరణం సృష్టిస్తుందని అందుకు నిదర్శనమే జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణలో ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో నాయకులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేపట్టడం జరిగిందని కేసీఆర్ ప్రభుత్వం రానున్న రోజుల్లో గద్దె దించడం ఖాయమని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. మూడవ తేదీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నరేంద్ర మోడీ విజయ సంకల్ప బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రత పోలింగ్ బూత్ నుంచి 30 మందికి తగ్గకుండా కార్యకర్తలు సంకల్ప సభకి హాజరుకావాలని సూచించారు.అలాగే కేసీఆర్ నియంత నిరంకుశ పాలను అంతమొందించాలంటే కార్యకర్తలు కంకణబద్ధులై పని చేయాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా కాషాయపవనాలు వీచాయని బిజెపి తెలంగాణను కమ్మేసిందని అన్నారు.కేసీఆర్ కుటుంబ పాలన గడీల పాలన రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని కాకతీయ సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో భూపాలపల్లి జిల్లాలో కాషాయ జండా ఎగరేసే వరకు నిశ్రమించకుండా పనిచేయాలని సూచించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు కాకుండా కెసిఆర్ నిర్వీర్యం చేస్తున్నారని తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని దేశవ్యాప్తంగా ఉచితంగా రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని, దేశవ్యాప్తంగా మహిళల అభివృద్ధి కోసం మహిళలను అన్ని రంగాల్లో శక్తివంతులుగా తయారు చేయడం కోసం బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో కూడా అమలవుతుందని వివరించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక గొప్ప సంకల్పంతో భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం బిజెపి కట్టుబడి ఉందని అన్నారు కరోనా విపత్తు సమయంలో దేశ ప్రజలకు ఉచితంగా టీకా అందించిన ఘనత ప్రపంచవ్యాప్తంగా కేవలం మోడీ గారికి దక్కుతుందని కొనియాడారు అలాగే నరేంద్ర మోడీ సభను జయప్రదం చేయడం కోసం కార్యకర్తలందరూ విజయ సంకల్ప సభకు తరలిరావాలని సూచించారు. జిల్లాలోని కాళేశ్వరం ముక్తిశ్వర స్వామి వారిని ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను అలాగే రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కన్నం యోగేందర్ గారు జిల్లా ఇంచార్జ్ ఉదయ ప్రతాప్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి చందుపట్ల కిర్తీ సత్యపాల్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిషిదర్ రెడ్డి, ప్రసాద్ రావు, మోరే రవీందర్ రెడ్డి, బిజెవైయం జిల్లా అధ్యక్షుడు గొర్రె శశి కుమార్, మీడియా ఇంచార్జి పోశాల రాజు , మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు వేశాల సత్యవతి, బట్టు రవీందర్, సాంబయ్య , రామకృష్ణ, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.