కబ్రస్థాన్ స్థలాన్ని ఇప్పించాలని mro గారికి వినతిపత్రం సమర్పించిన మండల నూర్ బాషా సంఘం నాయకులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామంలో .అన్నపూర్ణ ప్రాజెక్టు నిర్మాణం కోసం గ్రామంలో ఉన్న ఇండ్లతో పాటు ఇదివరకు ఉన్న ముస్లిం మైనారిటీలకు చెందిన కబ్రస్థాన్ (స్మశానవాటిక)ను కూడా డ్యామ్ లో పోవడంతో అప్పటి నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు కానీ ఇప్పుడు గ్రామ సౌకర్యాలు నిమిత్తం గ్రామ పంచాయతీ ద్వారా అందులో ప్రకృతి వనం మొక్కలు నాటడం జరుగుతుంది అని అనంతగిరి గ్రామస్థులు సాహెబ్ అలీ గారికి తెలపడంతో విషయం ఇల్లంతకుంట మండల నూర్ బాషా సంఘం అధ్యక్షుడు మొహ్మద్ సలావోద్దీన్ గారి దృష్టి కి తీసుకరగా ఈరోజు మండల నూర్ బాషా సంఘం నాయకులు అందరూ కలిసి mro బహు సింగ్ గారిని కలిసి అనంతగిరి గ్రామములో మా ముస్లింల కోసం మాకు కబ్రస్థాన్ కు స్థలాన్ని కేటాయించాలని mro ను కోరగా వారు సానుకూలంగా స్పందించి మీకు వీలైనంత తొందరగా పై అధికారుల దృష్టి కి తీసుకెళ్లి కబ్రస్థాన్ కోసం స్థలాన్ని కేటాయిస్తామని mro బహు సింగ్ గారు తెలిపారు …అలాగే mro కి నూర్భాష సంఘం నాయకులు mro కి వినతిపత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో నూర్ బాషా సంఘం గౌరవ అధ్యక్షుడు మంజూర్ అలీ.మండల నాయకులు. జమాల్.సాహెబ్ అలీ.మహేమూద్ పాషా.తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.