కందుల వారి పల్లి గిరిజనులకు త్రాగునీరు, బాలాజీ నగర్ అరుంధతి వాడ భూములు సమస్య పరిష్కరించాలి! జనం కోసం సిపిఎం లో ఫిర్యాదు!

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం కందుల వారి పల్లి పంచాయతీ కమలాపురం గిరిజన కాలని,  బాలాజీ నగర్, అరుంధతి వాడ,  గ్రామాల్లో, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు, సి హెచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, బుధవారం,  జనం కోసం సిపిఎం  కార్యక్రమం సందర్భంగా, ప్రజల కలుసుకొని, కరపత్రాలు పంపిణీ చేశారు. కమలాపురం గిరిజన కాలని, కి గత నాలుగు సంవత్సరాల  నుండి త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని, జనం కోసం సిపిఎం, కార్యక్రమం సందర్భంగా  సిపిఎం  నాయకుల దృష్టికి  తీసుకొచ్చారు. బోరు మోటర్, ఉన్న ట్రాన్స్ఫారం లేక, విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదన్నారు. అగ్రవర్ణాల వారు పొలాల్లో   గిరిజనులు నీళ్లు పట్టుకోడానికి అభ్యంతరం చెబుతున్నారని వాపోయారు. ఎప్పుడైనా,  అగ్రవర్ణాలకు కూలీ పనులకు, వస్తేనే తాగునీరు పట్టుకొని ఇస్తారు, లేకుంటే తాగునీరు కి అభ్యంతరం చెబుతున్నారు. తక్షణం తాగునీరు ఇప్పించాలని గిరిజన మహిళలు వేడుకున్నారు. సిపిఎం నాయకులు, ఎం డి ఓ, ఆర్డబ్ల్యూఎస్, ఏ ఈ దృష్టికి, తీసుకెళ్లగా, లక్ష 5000 రూపాయలు,  ట్రాన్స్ ఫారం కోసం,  ఎస్టిమేషన్ లు వేసి, ప్రతిపాదనలు పంపి, ఏడాది అయ్యిందని, ప్రభుత్వం ఇంకా నిధులు కేటాయించలేదన్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని, ఎంపీడీవో సమత, సిపిఎం నాయకులు ఒక హామీ ఇచ్చారు. వీధి లైట్లు వెలగడం లేదని,  రాత్రుల్లో విష సర్పాలతో భయభ్రాంతులకు గురవుతున్నారు. సిమెంటు రోడ్డు లేదన్నారు, గత టిడిపి ప్రభుత్వంలో, ఇచ్చిన పక్కా గృహాలు బిల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్ రోడ్డు వేయాలని కోరారు. ఉపాధి హామీ జాబ్ కార్డులు లేవు అని, పనులు దొరకడం లేదని, అప్పుడప్పుడు అగ్రవర్ణాల పనులకు పోవడం జరుగుతుందని, మగవారికి 250, ఆడవారికి 150 కూలి ఇస్తున్నారని, ధరలు పెరగడంతో, కుటుంబ పోషణ ఏమాత్రం సరిపోలేదు అన్నారు. అదేవిధంగా బాలాజీ నగర్ అరుంధతి వాడ, పక్కనున్న సర్వే నెంబర్ 993, లో రెండు ఎకరాల 33 సెంట్లు, ప్రభుత్వ స్థలాన్ని, అగ్రవర్ణ భూస్వాములు  అక్రమంగా పట్టా సంపాదించారనీ, తక్షణమే దాన్ని రద్దు చేసి, దళితులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరో నలుగురు దళితులు కు 991 సర్వేనెంబర్ లో, పట్టాలు ఇచ్చిన భూములను, విజయవాడ ప్రభుత్వ ఉద్యోగం నిర్వహించే వారి  దౌర్జన్యంగా, ఆక్రమణ,పేరుతో తన భార్య, బినామీ పేర్లతో, దాదాపు 25 ఎకరాలు కబ్జా చేసి అనుభవిస్తున్నారు,  తక్షణం అగ్రవర్ణాల ఉద్యోగస్తుల భూములను రద్దు చేసి, దళితులకు పంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీ డబ్బులు గత ఆరు వారాలుగా రాలేదని, గతంలో ఇచ్చే  వేసవి అలవెన్సు రద్దు చేయడంతో, కూలి తక్కువ పడుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందించడం లేదని, ఆ వచ్చిన కూలీ డబ్బులు, మందులు మాత్రలు కె సరి పోతున్నాయని, అన్ని రకాల ధరలు పెరగడంతో, అప్పులు చేసి, బ్రతకాల్సిన వస్తుందనే ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నిరుద్యోగులకు , ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిలేని పేదలకు భూమి ఇవ్వాలని కోరారు, జగనన్న కాలనీ, గ్రామానికి దూరంగా సాయి నగర్ లో కేటాయించారని, అందుబాటులో లేదని, గ్రామం పక్కనే జగనన్న కాలనీ ఇచ్చి, ప్రభుత్వ ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఇసుక సిమెంటు కమ్మే ఇటుక, కూలీల ధరలు పెరగడంతో, దళితులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు.  సిపిఎం పోరాట ఫలితంగా  వికలాంగులకు కస్తూర్బా స్కూల్ వద్ద ఇచ్చిన ఇంటి స్థలం, రెవెన్యూ అధికారులు చూపించాలని డిమాండ్ చేశారు. గడపగడపకు  వైసీపీ ప్రభుత్వం , కార్యక్రమం నిర్వహించిన, ఈ సమస్యలు కనిపించలేదా అని ప్రశ్నించారు. పంచాయతీలకు, మండల పరిస్థితులకు, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, మూడు సంవత్సరాల నుండి, గ్రామాల్లో, సమస్యలు పరిష్కారం కాలేదని, కనీసం వీధిలైట్లు వేసే దిక్కులేదని, ఆందోళన వ్యక్తం చేశారు. పై సమస్యల పరిష్కారం కోసం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు,  ఓబిలి. పెంచలయ్య, విజయ్ కుమార్ నాని,  మల్లారపు, గురవయ్య పగడాల భరత్ కుమార్, పంది కాళ్ళ పెంచలయ్య. తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.