ఏపీఎండీసీ స్కూలు  హౌస్ కీపింగ్ కి కనీస  వేతనాలు ఇవ్వాలని ఎండి కి వినతి పత్రం!

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట  ఏపీఎండీసీ  పబ్లిక్ స్కూల్ లో పని చేస్తున్నా హౌస్ కీపింగ్  కార్మికులకు  కనీస వేతనం, జీవో నెంబర్ 7 ప్రకారం, 15000  అన్ స్కిల్డ్, ఇవ్వాలని, ఏపీఎండీసీ ఎండి శ్రీ  విజీ వెంకట రెడ్డి గారికి, విజయవాడ హెడ్ ఆఫీస్ లో,  బుధవారం, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు  అనుబంధ గౌరవ అధ్యక్షులు, సి హెచ్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి, నారదాసు సుబ్బరాయుడు, హౌస్ కీపింగ్, స్కావెంజర్స్ యూనియన్ నాయకులు, కే లక్ష్మి,  కే సుభాషిని,   కె మేరీ, తదితరులు పాల్గొన్నారు. సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ, యాజమాన్యం, ,  పిఎఫ్, ఈ ఎస్ ఐ, కనీస వేతనం అమలు చేయకుండా 8000 ఇస్తూ, కార్మికుల చేత వెట్టిచాకిరి చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలు అమలు చేయకుండా, 12: గంటలు  పని చేయించుకుంటున్నారు  కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కార్మికులకు అందరికీ  యూనిఫారం, అదనపు పనికి అదనపు పని వేతనం చెల్లించాలన్నారు, మెడికల్ లీవులు, మెటర్నటీ లీవ్ లు, ఇప్పించాలని వినతి పత్రంలో కోరారు, దాదాపు 24 మంది  స్కావెంజర్స్, హౌస్ కీపింగ్,  కేర్ టేకర్ సెక్యూరిటీ తదితర పనులు చేస్తున్నారని తెలిపారు.  ఏపీ ఎం డి సి  ఎండిగారు మాట్లాడుతూ, అతి త్వరలోనే, సర్వే చేసి, జీవో ప్రకారం కనీస వేతనాలు ఖచ్చితంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఎండి గారికి  కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.