ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయం పై NSUI కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎల్బి నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయం పై NSUI కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి గుండె శివ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్లోని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కార్యాలయాన్ని రాత్రి 10 గంటలకు NSUI కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రాష్ట్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు ఇలాంటి దాడులకు పాల్పడిన NSUI కార్యకర్తల దాడిని ప్రతి ఒక్క విద్యార్థి సంఘం ఖండించాల్సిన అవసరం ఉందని దాడికి పాల్పడిన గుండెలపై చర్యలు తీసుకోవాలని అన్నారు కేరళ రాష్ట్రంలోని రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులను సంఘం నుండి సస్పెండ్ చేసి శిక్ష విధించడం జరిగింది రాహుల్ గాంధీ కార్యాలయంపై జరిగిన దాడిని ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పినా కూడా వారిపై తగు చర్యలు తీసుకున్న కూడా తెలంగాణ రాష్ట్ర ఎస్ఎఫ్ఐ కార్యాలయం పై దాడి చేయడం సరికాదని అన్నారు ఎస్ ఎఫ్ ఐ కార్యాలయంపై జరిగిన దాడిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తలేదు అని ఆయన అన్నారు ఇలాగే దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎంతవరకు ఓపిక పట్టాల అంతవరకు పడతాం అని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు…ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మహేష్, స్టాలిన్, శివ, మల్లేష్, భాను, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.