ఊరుకొండ మండలాన్ని హరిత మయం చేయడమే లక్ష్యం MPP-రాధ జంగయ్య.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలాన్ని హరితమయం చేయడమే లక్ష్యమని MPP-రాధజంగయ్య అన్నారు శుక్రవారం హరితహారం కార్యక్రమం లో భాగంగా ఊరుకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గల వన నర్సరీని పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొమ్ము రాజయ్య, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరి నాయక్, మండల ప్రత్యేక అధికారి చంద్రశేఖర రావు, ఎంపీడీవో ప్రభాకర్, ఎం పీ ఓ వెంకటేష్, మండల నాయకులు బచ్చలకూర రమేష్ కొమ్ము శ్రీను బండి మల్లేష్ టెంపుల్ డైరెక్టర్ రాచకొండ గోపి యువ నాయకులు పులిజ్వాల చంద్రకాంత్, మెందేళ్ల శ్రీశైలం ఉపాధిహామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.