ఇంటింటికి జనం కోసం సిపిఎం , కార్యక్రమాన్ని జయప్రదం చేయండి!

దేశంలో బిజెపి ప్రభుత్వం  8 సంవత్సరాలు ఒక మంచి పని చెయ్యకపోగా, ప్రజలపై భారాలు మోపి, కష్టాల్లో ముంచేచేసిందని, ముఖ్యఅతిథిగా విచ్చేసిన  సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి  పి శ్రీనివాసులు ఆరోపించారు. రైల్వేకోడూరు సిపిఎం పార్టీ, లింగాల యానాదయ్య,  అధ్యక్షతన  జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేసింది అని, అంబానీ ఆ దానీ లాంటి కార్పొరేట్లకు దోచి పెట్టిందని, ప్రజల పైన మాత్రం, పెట్రోల్ డీజిల్ గ్యాస్, నిత్యావసర ధరలు పెంచి భారాల మోపిందన్నారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి, భారం, యువతకు ఉద్యోగాలు లేవు,  కార్పొరేట్లకు అనుకూలంగా   కార్మిక చట్టాల రద్దు, రైతు వ్యతిరేక చట్టాలు, రైతు గిట్టుబాటు ధర లేక, ఆత్మహత్యల పెరిగాయన్నారు. కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది, ఉపాధి  హామీచట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, వ్యాపారాలు దెబ్బతిన్నాయని, చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని, మైనార్టీలకు, మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. ప్రైవేటీకరణ విధానాలతో, సామాజిక న్యాయం, కనుమరుగయ్యింది అన్నారు, ఈ సమస్యల నుండి  దృష్టి మరల్చడానికి మతోన్మాద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చి సద్వినియోగం చేసుకోకుండా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి  లొంగి పోయి,  షరతులు అమలుచేస్తూ, రైతుల మోటార్లకు మీటర్ల బిగించడం ,రాష్ట్ర ప్రజల పైన, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఆస్తిపన్ను, చెత్త పన్ను, లాంటి భారాలు మోపారు అన్నారు. దళితులు మహిళ పైన అత్యాచారాలు పెరిగాయన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి  జూన్ నెలలోఇంటింటికి సిపిఎం కార్యక్రమం నిర్వహిస్తుందని ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు, అన్నమయ్య జిల్లా సిపిఎం నాయకులు సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాయని, భ్రమల్లో ఉంచుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ,  విభజన చట్టం హామీలు ప్రత్యేకహోదా గానీ, కడప ఉక్కు గాని, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ గానీ, ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాల గాని, అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ సంస్థలు, గనులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వారికి అప్ప చెబుతున్నారన్నారు, ఒక్క సిపిఎం మాత్రమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా ఉండాలని నిలబడిన ఏకైక దమ్మున్న పార్టీ అన్నారు. ఓట్లు సీట్లు సంబంధం లేకుండా ప్రజల పక్షాన సూత్రబద్ధమైన వైఖరి తీసుకుందన్నారు. టిడిపి, వైసిపి, ఇలాంటి పార్టీలు అవకాశవాద రాజకీయాలు నడిపాయి అన్నారు. బిజెపి చేసే తప్పుల్లో   పాపాలలో జనసేన పార్టీ భాగస్వామ్యం అయిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, ఎన్నికల ముందర, పాదయాత్రలో, చేసిన వాగ్దానాలు అమలు చేయలేదన్నారు, అవుట్సోర్స్, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని, అమలు చేయలేదన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని, విభజన చట్టం హామీలు కోసం పోరాడే సాధిస్తామని చెప్పి, వాటి ప్రస్తావనే లేదన్నారు, ప్రజా వ్యతిరేక చట్టాలకు పార్లమెంటులో మద్దతు ఇస్తున్నారు, రాష్ట్రంలో  ఒకవైపు  భూకబ్జాలు పెరుగుతున్నాయని,రౌడీయిజం, గుండాయిజం, అత్యాచారాలను, అదుపు చేయడంలో విఫలం అయింది అన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమాలను, పోలీసుల ద్వారా  అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు, అందులో భాగమే 30 యాక్ట్,పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.  అరకొర ఉపయోగపడుతున్న సంక్షేమ పథకాలు కోత విధిస్తున్నారు, జగన్ అన్న ఇల్లు, కట్టి తాళాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. నేడు బాధితులు ఇసుక అందుబాటులో లేదన్నారు, ఇనుప కన్ని, సిమెంటు ధరలు విపరీతంగా పెరిగాయి అన్నారు, ఇరిగేషన్, రోడ్లు, అభివృద్ధి లేదన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని, సామాజిక న్యాయం పేరుతో, పదవులు ఇచ్చారు కానీ నిధులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో  ముంచేశారు అన్నారు.  కేరళలోసిపిఎం, దేశానికి ఆదర్శంగా నిలబడి, రెండోసారి అధికారంలోకి వచ్చింది అన్నారు, కరోనా నివారణలో సమర్ధవంతంగా పని చేసిందని, విద్య వైద్యం ప్రజలకు అందుబాటులో ఉందని, కనీస వేతనాలు అమలు చేస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని, 18 రకాల నిత్యవసర వస్తువులు  సరఫరా చేస్తుందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడిందని, ప్రభుత్వ సంస్థల కాపాడుతుందని, అవినీతికి వ్యతిరేకంగా నిలబడిన అన్నారు. ఇంటింటికి సిపిఎం కార్యక్రమాలకు సమస్యలు వివరించి ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, మోడీ సుబ్బరామయ్య, ఎం జయరామయ్య, ఓబిలి  పెంచలయ్య,బొజ్జ శివయ్య, దాసరిజయ చంద్ర,  పి.జాన్ ప్రసాద్, డమ్ముశివ శంకర్, అంకిపల్లి,చే0గయ్య కేశవులు,  నాగి పోగు.పెంచలయ్య, హరి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.