ఆయిల్ ఫామ్ పంటను ప్రోత్సహించాలి. కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 24; ఆయిల్ఫామ్ సాగు లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్ నందు ఉద్యానవన శాఖ, సువేన్ ఆగ్రో కంపెనీ, ఎంఐ కంపెనీలతో,ఏఈఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగు 22- 23 ఆర్థిక సంవత్సరానికి గాను భూపాలపల్లి జిల్లా కు 7,450 ఎకరాలు డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ హైదరాబాద్ వారు కేటాయించడం జరిగింది. సాగు లక్ష్యాన్ని సాధించడానికి ఆయిల్ పామ్ మొక్కలు సరఫరా చేస్తూ సూక్ష్మ నీటిపారుదల పథకాలను అనుసంధానం చేస్తూ లక్ష్యాలు సాధించడానికి కలెక్టర్ తగు సూచనలు చేశారు. ఏ ఈ ఓ లు ఆయిల్ ఫామ్ సాగుకు రైతులకు అవగాహన పరిచాలన్నారు. నెలకు వెయ్యి ఎకరాలు ఆయిల్ఫామ్ సాగు కొరకు లక్ష్యంగా పెట్టుకొని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 45 క్లస్టర్స్ ను ఎఈవోలు, మైక్రో ఇరిగేషన్ సిబ్బంది ఒక క్రమపద్ధతిలో రైతులను మోటివేట్ చేయాలని చెప్పారు .ప్రతి శనివారం జూమ్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని వారంలో సాధించిన లక్ష్యాలను వివరాలను జూమ్ మీటింగ్లో చర్చించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అవంతారాలను అధిగమిస్తూ భౌతిక లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి అక్బర్ ,సుమన్ ఆగ్రో ఇండస్ట్రీస్ డైరెక్టర్ గౌతమ్ రెడ్డి , మైక్రో ఇరిగేషన్ సంబంధించిన ఐదు కంపెనీలు, డిప్యూటీ హార్టికల్చర్ ఆఫీసర్ సునీల్ కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.