ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్.

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 4 ; సింగరేణి హాస్పిటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. శనివారం మధ్యాహ్నం భూపాలపల్లి లోని సింగరేణి సంస్థ వారిచే నిర్వహిస్తున్న సింగరేణి హాస్పిటల్ ను కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి సి సెక్షన్ ఆపరేషన్ లు వివరాలను డాక్టర్లు,సిబ్బంది, మందులు, పరికరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ప్రసూతి కేంద్రం లో ఉన్న పడకలను రోగులకు సింగరేణి అందిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. సింగరేణి హాస్పిటల్ లోని పరికరాల వివరాలు వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం సిజేరియన్ ప్రసవాలు జరగకుండా , సాధారణ ప్రసవాలు జరిగే విధంగా డాక్టర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.