అన్ని మొక్కలు బ్రతికేలా చర్యలు చేపట్టాలి – టెక్నికల్ అసిస్టెంట్ సోమ జాహ్నవి

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ: 22-06-2022 ; ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలం తంతొలి గ్రామపంచాయతీలో నర్సరీ పనులను ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్ సోమ జాహ్నవి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంతోలి గ్రామ పంచాయతీ నందు నర్సరీలో పదివేల మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు. అన్ని మొక్కలు బ్రతికేలా చర్యలు చేపట్టాలని వన సేవక్ కు సూచించారు. వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టనున్నట్లు, అట్టి సమయం వరకు మొక్కల సంరక్షణ చేపట్టి, హరితహారం కార్యక్రమంకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే మొక్కలు నాటుటకు స్థలాలను గుర్తించి,ఎస్టిమేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, కారోబార్ సురేష్, ఉపాధి హామీ మెట్లు అనిల్, వినోద్ వన సేవక్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.