అధికారుల హామీతో సిపిఐ దీక్షల విరమణ

ప్రజానేత్ర న్యూస్,ఆదిలాబాద్, తేదీ:04-06-2022 ; ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గత 72 రోజుల నుండి అర్హులైన పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని లేదా డబుల్ బెడ్రూంలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్షలను అధికారుల హామీతో విరమించడం జరిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఐక్యంగా ప్రజలందరూ సిపిఐ ఆధ్వర్యంలో చేసిన పోరాటంలో భాగంగానే అధికారులు దిగివచ్చి సానుకూలంగా స్పందించి న్యాయం జరిగేల హామీ ఇవ్వడం జరిగిందన్నారు. పేద ప్రజల కొరకు భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.