అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలుచోట్ల యోగాభ్యాసం చేసిన భాజపా నాయకులు డా.పాల్వాయి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలుచోట్ల యోగాభ్యాసం చేసిన భాజపా నాయకులు డా.పాల్వాయిఈ రోజు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాగజ్నగర్ పట్టణంలోని పలు చోట్ల యోగాభ్యాసం లో పాల్గొన్న భాజపా నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు.పటేల్ గార్డెన్స్ లో పతంజలి యోగ పీఠం వారి ఆధ్వర్యంలో యోగా ఔత్సాహికుల తో కలిసి యోగాభ్యాసం చేయడం జరిగింది.పద్మశాలి భవన్ లో యోగా ట్రైనర్ శ్రీ కొంగ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిబిరంలో పాల్గొనడం జరిగింది.సర్ సిల్క్ లో యోగా ట్రైనర్ డా.సమీత్ గుప్తా ఆధ్వర్యంలో యోగాభ్యాసం చేయడం జరిగింది.ఈ సందర్భంగా భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ యోగాశాస్త్రంలో ప్రపంచానికి భారతదేశం దిక్సూచిగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. మన ప్రధాని నరేంద్ర మోదీజీ కృషివలన యోగాభ్యాసానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని తెలియజేశారు.ఈ యోగ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు డా కొత్తపల్లి శ్రీనివాస్, భజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు శివ గౌడ్, పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్, మాజీ కౌన్సిలర్ దెబ్బటి శ్రీనివాస్, సంతోష్ ఠాకూర్, డోంగ్రి అరుణ్, అనిల్ కుమార్, కొండ తిరుపతి, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.