అంగన్వాడి కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 14 ; భూపాలపల్లి లో మంగళవారం పట్టణ ప్రగతి లో భాగంగా 22, 23, 04, వ వార్డులో కలెక్టర్ పర్యటించారు దీనిలో భాగంగా హనుమాన్ నగర్ 2 లోని అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక జిల్లా సందర్శించారు సెంటర్ లోనే పిల్లలను బాలింతలను గర్భిణీ స్త్రీల వివరాలను అంగన్వాడి టీచర్ పద్మ ని అడిగి తెలుసుకున్నారు. పిల్లలను ఆంగ్ల పదాలు, అంకెలు, అడిగి చెప్పించుకున్నరు పిల్లలందరినీ కలెక్టర్ అభినందించారు .కేంద్ర గ్రంథాలయం పక్కనున్న ఆరోగ్య ఉప కేంద్రానికి పరిశీలించారు.5530 మందికి ఎన్ సి డి చేయడం జరిగిందని ఏఎన్ఎం సరోజ కలెక్టర్కు తెలిపారు. టీబి పేషెంట్లకు వారి అకౌంట్లలో 500 రూపాయలు జమ అయ్యేటట్లుగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పీహెచ్సీలలో నే డెలివరీలు అయ్యే విధంగా చూడాలన్నారు. అనంతరం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఆకస్మికంగా పరిశీలించారు.రోజుకు ఎంత మంది పేషెంట్స్ వస్తున్నారు వారికి అందిస్తున్న మందుల వివరాలను కలెక్టర్ డాక్టర్ జ్యోతి ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారిపట్ల సత్ప్రవర్తనతో మెలగాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకట రాణి సిద్దు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ రవీందర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.