కామ్రేడ్ సుందరయ్య 37 వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ ఇల్లంతకుoట ముస్కన్ పేట గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశంలో కామ్రేడ్ సుందరయ్య 37 వర్ధంతి సందర్భంగా గణ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతూ తాము నమ్మిన సిద్ధాంతాలకు చివరివరకు కట్టుబడ్డ మహనీయుడు సుందరయ్యని ఆయన పేర్కొన్నారు. మార్క్సిస్టు సైద్ధాంతిక భావజాలం గల నేతగా బడుగు బలహీన వర్గాల ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచే సుందరయ్య జీవితం ఆదర్శవంతమైన ఇతర నేతలు ఆయనను మార్గదర్శకంగా తీసుకోవాలని పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ఆయన నిత్యం ప్రజలతో ఉండి వాటిని ఎండగడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కొరకు కృషి చేసారని ఆయన అన్నారు. ,ఈ వర్ధంతి సభలో CITU మండల అధ్యక్షులు సావనపెళ్లి రాములు కిషన్ రెడ్డి లచ్చయ్య స్వామి రజిత రవి బాబు అనీల్ తదితరులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట మండల్ రిపోర్టర్ బొల్లం సాయిరెడ్డి

Leave A Reply

Your email address will not be published.