సీపీఐ నేత పరామర్శ

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:29-05-2022;ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల ఎంపిటిసి ఉడుగు కమలాకర్ తమ్ముడు ఉడుగు ఆనంద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆదివారం వారి స్వగృహానికి వెళ్లి ఎంపీటీసీ కమలాకర్ తో పాటు మృతుని భార్య,పిల్లలను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఆధారంలేని ఉడుగు ఆనంద్ అకాల మరణం వారి కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందులోకి నెట్టిందని అన్నారు. మృతుడు ఆనంద్ కు వ్యవసాయ భూములు, ఎలాంటి ఆర్థిక సహకారం లేక పోవడంతో సభ్యులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు కింద పది లక్షల రూపాయలను ఆనంద్ కుటుంబానికి అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గణేష్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.