శాండ్ కార్మికులకు  రెండు సంవత్సరాల బోనస్ ఏపీఎండీసీ చెల్లించాలి! సిఐటియు డిమాండ్!!

ఏపీఎండిసి శాండ్ కార్మికులకు, రెండు సంవత్సరాల బోనస్ ని కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఎగ్ కొట్టారని, ప్రిన్సిపల్ ఎంప్లాయ్ ఏపీఎండీసీ యాజమాన్యం నేరుగా కార్మికులకి చెల్లించాలని  ఏపీ  శాండ్ ఎంప్లాయిస్ యూనియన్, రాష్ట్ర కన్వీనర్  సిహెచ్. చంద్ర శేఖర్ డిమాండ్ చేశారు.  అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరులో, సిఐటియు ఆఫీసులో, సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, 2019, 20 సంవత్సరంలో మురళి మ్యాన్పవర్ ఏజెన్సీ కింద 2020, 21  సంవత్సరంలో, రెడ్డి ఎంటర్ప్రైజెస్  కాంట్రాక్టు కింద,రెండు వేల మంది   అవుట్సోర్సింగ్ కార్మికులు  ఇసుకలో పనిచేశారని  తెలిపారు. కానీ బోనస్ మాత్రం చెల్లించ లేదన్నారు, కార్మిక చట్టం ప్రకారం లాభనష్టాల తో సంబంధం లేకుండా, 8.33, ఏడాదికి ఒక నెల జీతం కార్మికులకు చెల్లించాలని చట్టం చెబుతోందన్నారు.  కాంట్రాక్టర్
ఏజెన్సీ, ఒక రూపాయి చెల్లించలేదని, ప్రిన్సిపల్ ఎంప్లాయి గా ఏపీఎండీసీ యాజమాన్యం, ఎండి గారే రెండు సంవత్సరాల బోనస్సు చెల్లించాలని డిమాండ్ చేశారు. వైసిపి రాష్ట్ర ప్రభుత్వం, రెండు వేల మందికి ఉపాధి కల్పించామని,  గొప్పగా చెప్పుకొని, రెండు సంవత్సరాల లోనే రెండు వేల మందిని కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించింది అన్నారు. రాత్రి పగలు కష్టపడి పనిచేసిన, 700 కోట్ల లాభాలు సంపాదించిన, కార్మికులకు మాత్రం మొండిచేయి చూపారు  అన్నారు.  అధికార పార్టీ బినామీ కాంట్రాక్టర్, రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ, ఈ ఎస్ ఐ డబ్బులు స్వాహా చేశారన్నారు. కార్మికుల వాటా, మేనేజ్మెంట్ వాటా, ఈ ఎస్ ఐ హాస్పిటల్ కి చెల్లించ లేదన్నారు ,  దీనిపైన సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వీరి కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ జోక్యం చేసుకొని  ఇసుక కార్మికులకు న్యాయం చేయాలని  డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో సి ఐ టి యు  ఏపీఎండీసీ,సీనియర్ కార్మిక నాయకులు, మోడీ సుబ్బరామయ్య,  సి ఐ టి యు ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.