వృత్తి శిక్షణా కార్యక్రమాల ద్వారా ఆర్థిక అభివృద్ధి

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:23-05-2022 : 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ కాలనీ, స్విపర్ కాలనీ, కుమ్మరి వాడ, రవీంద్ర నగర్ కాలనీలలో జన శిక్షణ సంస్థాన్ ద్వారా టైలరింగ్, బ్యూటిషన్ శిక్షణ కార్యక్రమాలు నేర్చుకుని ఉత్తీర్ణత సాధించిన 100 మంది మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రామెల్ల శ్రీలత మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవడం వలన కుటుంబ పోషణలో ఆర్థికంగా మహిళలు భాగస్వాములు కావచ్చని అన్నారు. సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులు బ్యాంకుల ద్వారా, కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకొని టైలరింగ్ బ్యూటీషియన్ షాపులు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జన శిక్షణ సంస్థాన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజన్న, సిబ్బంది కదిరి వెంకట్, సంతోష్ టీచర్లు రూప, భారతి, వీణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.