విద్యాసాగర్ కుటుంబాన్ని పరామర్శించిన టి.ఏ.జె.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు -పాల్గొన్న రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమళ్ళ గ్రామానికి చెందిన పోగుల విద్యాసాగర్ (అక్షిత రిపోర్టర్ టీఏజేఎఫ్ వరంగల్ జిల్లా ట్రెజరర్) భార్య మౌనిక ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన విషయాన్ని తెలంగాణ ఆల్ జర్నలిస్టు ఫెడరేషన్ (టి.ఏ.జె.ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు తెలుసుకొని, విద్యాసాగర్ ను ఓదార్చి పరామర్శించి రూపాయలు 10 వేల ఆర్థిక సహాయం అందించారు. మృతురాలి చిన్న పిల్లలను చూసి చలించిపోయారు. మంగళవారం ఈ సందర్భంగా జితేందర్ రావు మాట్లాడుతూ ఆర్థికంగా గాని సామాజికంగా ఏ ఇతర సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా! మానసికంగా! శారీరకంగా ధైర్యంగా ఎదుర్కోవాలని, మరణం పరిష్కారం కాదని సూచించారు. ప్రజలకు ప్రభుత్వానికి నాలుగవ స్థంభం వలె పని చేస్తున్నా మీడియా మిత్రులకు ఎలాంటి ఆపద వచ్చినా తోటి మిత్రులు సహక రించాలని సూచించారు. టి.ఏ.జె.ఎఫ్ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా రాష్ట్ర నాయకత్వం వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టి.ఏ.జె.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూటెంకి ప్రభాకర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆర్‌.వి.ప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కొల్లూరి నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు అనుమాండ్ల దేవేందర్, గొల్లపెల్లి శ్రీధర్, ముక్కెర సుధాకర్, చింతల పవన్, మునిగె శ్రీకాంత్, గణపురం అశోక్, దొడ్డ రమేష్, పద్మశాలి కుల పెద్దలు పోగుల సూరయ్య, ఆడెపు కుమారస్వామి, గంజి నరహరి, గంజి యుగంధర్, రచ్చ పరశురాములు, పోగుల వివేకానందస్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.