వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పర్వతగిరి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ తో పాటు 18 మంది NSUI నాయకుల అక్రమ అరెస్టును నిరాకరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్ మరియు యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము రమేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు వెంకట్ తో పాటు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శిస్తామంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వివాదం చేస్తుందన్నారు.NSUI విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని, రాహుల్ గాంధీ గారి కార్యక్రమాలు సజావుగా సాగడానికి, ఓయూ పర్యటనకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్కల ప్రమోద్, వర్ధన్నపేట నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ బిర్రు రాజు, పర్వతగిరి పట్టణ అధ్యక్షులు కుసం రామ్ చందర్, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ నరుకుడు రవీందర్, దౌలత్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు కత్తుల వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షురాలు సావిత్రి,యువజన కాంగ్రెస్ మండల నాయకులు పిట్టల రంజిత్, నూనె మణికంఠ, పిట్టల లోకేష్, అఖిల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.