రైస్ మిల్లర్లు దోపిడికి గురి చేస్తే ఊరుకునేది లేదు – మాజీ ఎంపీ రాథోడ్

తాను అధికారంలో ఉన్న, లేకున్నా, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తునే ఉంటానని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు.మంగళవారం కడం మండలంలోని కొండుకూర్,పాండ్వాపూర్,అంబారిపేట గ్రామాల్లో ఉన్న వరి కోనుగోలు కేంద్రాలను సందర్శించారు.రైతులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కోనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.రైస్ మిల్లర్లు వడ్లు కట్ చేసి, దోపిడికి గురి చేస్తే ఊరుకునేది లేదన్నారు.ఆయన వెంట బిజెపి అధ్యక్ష కార్యదర్శులు కిష్టయ్య, తలారి రాజేందర్, రైతు మొర్ఛా అధ్యక్షులు ముక్కెర గంగాధర్, నాయకులు భాస్కర్, రాజేందర్ హపావత్, మోహన్,రమణ రెడ్డి,భూమారెడ్డి,భూషన్, ప్రసాద్, గంగారాం,తిరుమల్, పార్టీ కార్యకర్తలు, రైతులు,తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.