రైల్వేకోడూరు పంచాయతీలో పారిశుద్ధ్య లోపం! పందులను నివారించాలి! సిఐటియు డిమాండ్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మేజర్ పంచాయతీ లో చెత్త చదరము, డ్రైనేజీ, వేలాది పందులతో, పారిశుద్ధ్య లోపం గా ఉందని, దుర్గంధం వెదజల్లుతోంది అని, గురువారం కోడూరు పట్టణంలో, సిఐటియు ఆఫీసులో,సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ విలేఖర్ల సమావేశంలో డిమాండ్ చేశారు. పదిహేడు వేల కుటుంబాలు, 60 వేల జనాభా, 20వ వార్డు లో కలిగిన మేజర్ పంచాయతీలో, అతి తక్కువ మంది 70 మంది పంచాయతీ వర్కర్స్ తో పనిచేస్తున్నారని, మరో వంద మంది పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు జరిగిన, కొత్త పాలకవర్గం వచ్చినా, గత టీడీపీ ప్రభుత్వం కన్నా ఘోరంగా ఉందన్నారు. చెత్త ఎక్కడపడితే అక్కడ వేసుకున్నారని, చెత్తకుండీలు ఏర్పాటు చేయడం లేదని, ఆరోపించారు. పాత డ్రైనేజీ మురికి నీరు తో నిలిచి పోతున్నాయని, వైసీపీ ప్రభుత్వం లో కొత్తగా డ్రైనేజీ ఎక్కడ ఏర్పాటు చేయలేదన్నారు, పట్టణంలో, అన్ని వార్డుల్లో, వేలాది పందులు స్వైర విహారం చేస్తున్నాయని, దోమలు, ప్రజల జబ్బులు పడుతున్నారని, తెలిపారు. గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో తరలించాలి అన్నారు. రాత్రుల్లో మెయిన్ రోడ్ లో, వీధిలైట్లు వెలగడం లేదని, కోడూరు మెయిన్ బజార్,అంధకారంలో ఉందన్నారు. విద్యుత్తు సంస్థకు పంచాయతీ 10 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు, ప్రభుత్వం వీటిని, చెల్లించడం లేదా మాఫీ చేయడం, ఏదో ఒక నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ నీళ్లను, ప్రైవేటు ఫిల్టర్ వాటర్ కేంద్రాలు, అక్రమంగా పంచాయతీ నీళ్లు వాడుకుంటున్నారని, ఇది కరెంటు బిల్లలు రూపంలో, పంచాయతీ పైన పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రకాల పన్నులు 10 శాతం పెంచిన అభివృద్ధి లేదన్నారు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, పన్నుల నుంచి వచ్చే నిధులు, దేనికి ఖర్చు పెడుతున్నారు అర్థం కాలేదన్నారు. 15వ ఫైనాన్సు నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వాడుకోవడం అన్యాయం అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు మండల ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య, కర్ర తోటి హరినారాయణ, పి. మౌలాలి భాష తదితరులు పాల్గొన్నారు.