రైతులందరు కేవైసి చేసుకోవాలి

జయశంకర్ భూపాలపల్లి,30 ; రైతులందరూ ఈ కేవైసీ అప్డేట్ వేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టర్ చాంబర్లో వ్యవసాయ అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా లోని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు వస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సహాయం నిధులను పొందుటకు రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో pm-kisan సంబంధించి 46,726 మంది లబ్ధిదారులు దీని ద్వారా సంవత్సరానికి మూడు విడతలుగా ఆరువేల రూపాయలు రైతు ఖాతాలో జమ అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 24,384 మంది రైతులు ఈ కేవైసీ చేసుకున్నారని, ఇంకా 22,342 మంది లబ్ధిదారులు మిగిలి ఉన్నారని, వారందరూ 31 వ తారీకు లోపున ఈ కేవైసీ చేసుకో కొనేలా అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల తో ప్రతి గ్రామ పంచాయతీలలో నమోదు కార్యక్రమం రేపటి నుండి చేపట్టడం జరుగుతుందని గ్రామ పంచాయతీలలో లోని నోటీసు బోర్డు నందు ఈ కేవైసీ నమోదు చేసుకోని వారి పేర్లను పెట్టడం జరుగుతుందని కావున రైతులు గమనించి చేసుకోవలసిందిగా కలెక్టర్ తెలియజేశారు. ఈ కేవైసీ నమోదు కేంద్రాలకు రైతులు వచ్చునప్పుడు ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, బ్యాంకు పాస్ బుక్, తన వెంట తీసుకొని రావాలని ,రైతులందరూ ఈ కేవైసీ చేసుకోవడం వలన 11 విడత పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో పడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. కావున జిల్లాలోని ఈ కేవైసీ చేసుకొ కుండ ఉన్న రైతులు తప్పనిసరిగా అధికారుల సహాయంతో చేయించుకోవాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు తమ పూర్తి సహకారాన్ని రైతులకు అందించి 31 వ తారీకు లోగా అందరూ ఈ కేవైసీ అప్డేట్ చేసుకునే విధంగా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఏ ఓ విజయ భాస్కర్, సి ఎస్ సి అధికారిని మాధురి, వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.