రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం.

జయశంకర్ భూపాలపల్లి, మే 25;రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జూన్ 2వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల పై కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ సంవత్సరం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్ రాజీవ్ శర్మ ఐఏఎస్ హాజరవుతున్నారని, ఏర్పాట్లు ఘనంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అన్నారు. ఉదయం ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం సాయంత్రం 5:00 గంటలకు సింగరేణి క్లబ్ హౌస్ నందు కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా జాయింట్ కలెక్టర్ కే స్వర్ణలత, జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సురేందర్ రెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.