రాష్ట్రంలో ఉచిత బియ్యం కొనసాగించాలి

జయశంకర్ భూపాలపల్లి, మే 17;
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న 10 కిలోల రేషన్ బియ్యాన్ని రాష్ట్రంలో ఎందుకు కొనసాగించ డం లేదని కేవలం 6 కిలోలు మాత్రమే డబ్బులు తీసుకుని ఇవ్వడం ఏంటని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు.
-ప్రపంచవ్యాప్తంగా కరోన మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశ ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని వచ్చే సెప్టెంబర్ మాసం వరకు బియ్యం నిల్వలు అందుబాటులో ఉంచిందన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయడం లేదని అన్నారు
– స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి నిన్న మండలంలోని నాగారం గ్రామంలో రేషన్ దుకాణాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ ని తమ ఘనత ఏదో ఉన్నట్లు ఉచితంగా ఇచ్చే రేషన్ ని లబ్ధిదారులకు డబ్బులకు పంపిణీ చేస్తూ.. నాణ్యత బాగుందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు
– పేద ప్రజలకు ఉచితంగా వస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీని దోచుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
నిన్నటి సింగరేణిని సమావేశంలో ఎమ్మెల్యే గారు ఆవేశపూరిత ప్రసంగాన్ని ఆమె ఎద్దేవా చేశారు సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని కేంద్ర మంత్రి చెప్పినా అబద్ద ప్రచారాలు చేస్తూ కార్మికులను తప్పు దోవ పుట్టిస్తున్నాడని అన్నారు రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం పై విమర్శచేస్తూ వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టిఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తాడిచర్ల బ్లాక్ ని అప్పగిస్తే ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారో చెప్పాలని భూపాలపల్లి ఏరియాలోని కె టి కె ఎనిమిదవ గని సగభాగాన్ని ప్రైవేటీకరణ చేసి ఇ ఎస్ జి ఎల్ యంత్రాలతో మీ ప్రభుత్వం చేసింది వాస్తవం కాదా అని అన్నారు.
– సింగరేణిలో వివిధ విభాగాలలో నూతన నియామకాలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికులను, సెక్యూరిటీ సిబ్బంది ని, అండర్ గ్రౌండ్ లో రూఫ్ బోల్ట్ కార్మికులు, సింగరేణి ఆసుపత్రిలో ప్రయివేటు సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆరోపించారు మీకు చిత్తశుద్ధి ఉంటే వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.. కేంద్ర ప్రభుత్వం పై ఆరోపించే ముందు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆలోచించి మాట్లాడాలని అని మండిపడ్డారు..ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గణపతి, బీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు రాజేందర్, ఎస్సీ మోర్చ రాష్ట్ర నాయకులు బట్టు రవి, బిజెపి కార్యాలయ కార్యదర్శి ఉనుకొండ రామకృష్ణ, రూరల్ మండల అధ్యక్షులు ఇచ్చంతుల విష్ణు,బిజెవైం జిల్లా ఉపాధ్యక్షులు ఆసం సురేష్, బిసీ మోర్చ జిల్లా నాయకులు కంబాల రాజయ్య, రాకేష్, హరీష్, పొన్నాల కొంరయ్య, తదితరులు పాల్గొన్నారు…..

Leave A Reply

Your email address will not be published.