రసమయి బాలకిషన్ చిత్ర పటాలకు పాలాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కేషన్నపల్లె గ్రామంలో దళిత కుటుంబాలకు మొత్తం దళిత బంధు ఎంపికతో పాటుగా దళితులు ఉపాధి కొరకు కోరుకున్న యూనిట్లకు గ్రౌండింగ్ జరిగింది. దినసరి కూలీలుగ ఉన్న వారిని యజమానులుగా మర్చిన సీఎం కేసీఆర్ కి,తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ కు కృతజ్ఞతగ…TRS పార్టీ SC సెల్ మండల అధ్యక్షులు పసుల బాబు మరియు దళితుల తరుపున కేషన్న పల్లె గ్రామ లబ్ధిదారుల తరుపున ఇల్లంతకుంట మండల కేంద్రములోని బస్టాండ్ ఆవరణలో..తెలంగాణ దళిత బాంధవుడు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు KCR కి మరియు గౌరవ జిల్లా మంత్రి వర్యులు KTR కి,మన మానకొండూర్ నియోజకవర్గం అభివృద్ధి ప్రధాత,తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో కేసన్నపల్లె దళిత బంధు లబ్ధిదారులు,అన్ని గ్రామాల దళిత సర్పంచులు,ఎంపీటీసీలు,గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ డైరెక్టర్లు ఉపసర్పంచ్,వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

ఇల్లంతకుంట మండల్. రిపోర్టర్ బొల్లం సాయిరెడ్డి

Leave A Reply

Your email address will not be published.