యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట
మండలంలోని సోమారం పేట గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సానికి 150 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా స్మశానవాటిక వద్ద ట్రాన్స్ ఫార్మర్ కూలిపోయింది.
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఆదేశాల మేరకు సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య సెస్ ఎండి రామకృష్ణ, ఎంపీపీ వెంకటరమణారెడ్డిలతో కలిసి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విరిగిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించారు. అనంతరం గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం జరగడంతో యుద్ధప్రాతిపదికన విరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి గ్రామంలో గృహ విద్యుత్ ను పునరుద్దరించడం జరిగిందన్నారు. వ్యవసాయ బావులకు వెళ్లే విద్యుత్ ను రెండు రోజుల్లోగా పునరుద్దరిస్తామని సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాసం శ్రీనివాస్ రెడ్డి, ఏడీలు లక్ష్మణ్, ప్రదీప్, మాజీ సర్పంచ్ కందారం వెంకటాచారి, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు తడ్కపెళ్లి భూమయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ చల్ల నవీన్ రెడ్డి,ఏఈ హారిక, లైన్ ఇన్స్ ఫెక్టర్లు రవిందర్, శ్రీనివాస్, సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట మండల్ రిపోర్టర్ బొల్లం సాయిరెడ్డి

Leave A Reply

Your email address will not be published.