ముస్లిం ప్రజలందరినీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన నూర్ బాషా సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సలావోద్దీన్

:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల నూర్ బాషా సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సలావోద్దీన్… ముస్లిం కులస్తులు అందరూ చాలా పవిత్రంగా జరుపుకునే పండుగ అంటే ఒక్క రంజాన్ పండుగ అని.రంజాన్ మాసం మొదలైన నాటినుంచి నెల రోజులు ఉపవాసము పాటించి మాయొక్క భక్తి శ్రద్ధలతో 5 పూటలు నమాజ్ తో పాటు ప్రత్యేకంగా ప్రతి రోజు కూడా తారవి నమాజ్ అంటే ఖురాన్ గ్రంథం చదవడం జరుగుతుంది అని ఇది పండుగ ముందు నెల వంక కనపడే వరకు తరావి నమాజ్ చదవడం జరుగుతవుందని.ముఖ్యంగా పండుగ నమాజ్ ముందు ప్రత్యేకంగా జాకాత్.పిత్రా లు ఇవ్వడం మంచిదని .మహ్మద్ సలావోద్దీన్ అన్నారు. అలాగే ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ముస్లిం ల అందరికి మాకు అన్ని విధాలుగా నెల రోజులు పాటు సహాయ సహకారాలు అందించిన ఇతర కుల బంధావులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ. ఆరబ్ దేశాల్లో రంజాన్ పండుగ సోమవారం రోజు చేసుకోవడం జరిగింది కాబట్టీ. మనకు మంగళవారం ఉదయం పండుగ జరుపుకోవాలని ఇల్లంతకుంట మండల నూర్ బాషా సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సలావోద్దీన్ అందరికీ తెలియజేసారు .

Leave A Reply

Your email address will not be published.