మహిళల భద్రత లక్ష్యంగా పనిచేయండి జిల్లా ఎస్పి శ్రీ జె. సురేందర్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి, మే 22 ;జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళ భద్రతా లక్ష్యంగా పనిచేయాలని, మహిళలు, యువతులు చిన్నారుల జోలికి వస్తే కటకటాల శరణ్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి హెచ్చరించారు.సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 17 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు ఓపిగ్గా విన్నారు . ఇవాళ్టి ప్రజా కార్యక్రమoలో కొన్ని ఫిర్యాదులు ఇలా ఉన్నాయి. #తన భార్య, కూతురు, కొడుకు, డబ్బుల కోసం వేధిస్తున్నారని వారి నుంచి ప్రాణహాని ఉందని మహాముత్తారంకు చెందిన ఓ వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. # తన ఇంటిలో 6 యేళ్లుగా అద్దెకు ఉంటూ,అద్దె డబ్బులు అడిగితే, అసభ్య పదజాలంతో దూషిస్తూ, చoపుతానoటూ బెదిరింపులకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కా టారంకు చెందిన మహిళా పిర్యాదు చేసింది. తన కూతుర్ని తమ గ్రామంలో ఓ వ్యక్తి వేధిస్తున్నాడని తగిన చర్యలు తీసుకోవాలని చిట్యాల కు మండలానికి చెందిన ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. # తన భర్త గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న, తన కొడుకు పట్టించుకోకపోగా, తమకు చెందిన కొంత భూమిని వైద్యం కోసం అమ్ముదామని ప్రయత్నిస్తే తీవ్ర ఇబ్బంది పెడుతున్నాడని ఘనపురంకు చెందిన మహిళా ఎస్పికి తన ఆవేదన తెలిపింది. # కాటారంలో తన ఫ్లాట్ ను అక్రమంగా ఆక్రమించి, ఇదేమని అడిగితే దాడి చేస్తున్నారని, భూపాలపల్లికి చెందిన ప్రైవేటు ఉద్యోగి తన సమస్యను ఎస్పికి తెలిపారు. అనంతరం బాధితుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి, తన కార్యాలయానికి నివేదిక సమర్పించాలని, సంబంధిత సమంత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.