మన ఊరు..మన బడి అమలులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

మన ఊరు -మన బడి కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా మరియు మండల స్పెషల్ ఆఫీసర్ ల తో మన ఊరు మన బడి కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు .విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమంలో ప్రతి పాఠశాల యొక్క స్థితిగతులను కలెక్టర్ మండల స్పెషల్ ఆఫీసర్ మరియు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు గదులు, టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు గల పాఠశాలలో తప్పనిసరిగా 5 తరగతి గదులు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్ వద్ద వారి పరిధిలోని స్కూల్స్ సంబంధించిన అన్ని ఫోటోలు సిద్ధంగా ఉంచుకోవాలి అన్నారు. అదనపు గదుల నిర్మాణం, కాంపౌండ్ వాల్ ,కిచెన్ షెడ్ ,టాయిలెట్స్ ,త్రాగు నీరు మొదలగు వాటి వాటి వివరాలను చేపట్టవలసిన కార్యక్రమాలను కలెక్టర్ ఈ జిల్లా స్పెషలాఫీసర్ మరియు మండల స్పెషల్ ఆఫీసర్ లతో చర్చించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టబోయే కిచెన్ షేడ్స్ కాంపౌండ్ వాల్ నిర్మాణాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పాఠశాల లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు, దీని ఆధారంగా పాఠశాలలో పనులను పూర్తి చేయాలన్నారు . మన ఊరు- మన బడి కార్యక్రమంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.కె స్వర్ణలత, జడ్పీ సీఈఓ శోభారాణి, డిఆర్డిఓ డి. పురుషోత్తం, జిల్లా బిసి అభివృద్ధి అధికారి పి శైలజ, డిపిఓ ఆశాలత, జిల్లా ఆర్టికల్చర్ అధికారి అక్బర్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, డి ఎ ఓ విజయ భాస్కర్ ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.