బెంగుళూరుకు చేరుకున్న సీఎం కేసిఆర్ 

మాజీ ప్రధాని దేవగౌడతో బేటి అయిన సీఎం కేసిఅర్

సీఎం కేసిఅర్ కు బెంగూళురులో ఘనస్వాగతం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం బెంగళూరు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బెంగూలురుకు చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న సీఎం కేసిఆర్ గారు మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరుకొని, బేటిఅయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామితో బేటీ అయ్యారు. సిఏంతో పాటు ఎంపీ సంతోష్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.