ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిలిపి వేయడం అన్యాయం – డా.పాల్వాయి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు కాగజ్ నగర్ పట్టణంలోని ఇందిరా మార్కెట్లో గల రేషన్ షాపును భాజపా పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది.

అక్కడ ప్రజలకు అందుతున్న పీడీఎస్ బియ్యం పంపిణీ విధానాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ నెల నుండి ప్రతి వ్యక్తికి ఆరు కిలోల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని తెల్ల రేషన్ కార్డుదారులకు అందిస్తున్నామని రేషన్ షాపు డీలర్ తెలపడం జరిగింది.

పట్టణ అధ్యక్షుడు గోలెం వెంకటేశం మాట్లాడుతూ ఫోర్టీఫైడ్ బియ్యాన్ని అందించడంతో రక్తహీనత సమస్య నుండి బయటపడే అవాశాలున్నాయని తెలిపారు.ఈ ఫోర్టిఫైడ్ బియ్యంలో ఐరన్,ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ బి12 కలిసి ఉండడంతో ప్రజలకు మేలైన పోషణ అందుతుందని తెలియజేశారు.

భాజపా నాయకులు డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ గత రెండు సంవ్సరాలుగా కోవిడ్ మహమ్మారి తో బాధపడుతున్న ప్రజలను ఆదుకోవడం కోసం మోదీజీ ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) పథకాన్ని ప్రవేపెట్టి ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందించడం జరిగిందని పేర్కొన్నారు.

అయితే ఈ నెల నుండి ప్రతి వ్యక్తికి కేవలం 6 కిలోలు ఇచ్చి, కిలో బియ్యానికి రూపాయి వసూలు చేయడం దారుణమన్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తే,తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఈ పథకాన్ని పక్కనపెట్టి ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడం అన్యాయం అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గూడ రాకేష్, మాచర్ల శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, చిప్ప రమేష్, చిప్పకుర్తి శ్రీనివాస్, పాగిడి రాకేష్, కొండ తిరుపతి, కౌశిక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.